The Desk…Nellore : ప్రతి ఒక్కరూ విజయాలు అందిపుచ్చుకోవాలి ➖ మంత్రి ఆనం

The Desk…Nellore : ప్రతి ఒక్కరూ విజయాలు అందిపుచ్చుకోవాలి ➖ మంత్రి ఆనం

🔴 విజయవాడ/నెల్లూరు : ది డెస్క్ :

రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ.. తమ జీవితాల్లో విజయాలు అందిపుచ్చుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆకాంక్షించారు. చెడుపై మంచి గెలిచిన పర్వదినం విజయదశమి అని, ప్రజలందరికీ మంత్రి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయని, ఆ దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై పుష్కలంగా ఉండి, భక్తుల కోరికలు నెరవేరాలని మంత్రి ఆకాంక్షించారు.రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై , రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పరంజ్యోతి కరుణాకటాక్షాలు మెండుగా ఉండాలని, విజయదశమి స్ఫూర్తితో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నామని మంత్రి ఆనం చెప్పారు.