The Desk…Nellore: వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం

The Desk…Nellore: వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం

🔴 నెల్లూరు : ది డెస్క్ :

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ మంగళవారం మూలాపేట లోని ప్రముఖ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంను సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాల మధ్య మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజలు అనంతరం స్థానిక మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని సుమారు 16.7 కోట్ల రూపాయలతో దేవస్థానం పునః నిర్మాణ పనులు పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను మరియు ప్రణాళికలను కూలంకుశంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేసారు. సుమారు మూడున్నర ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు .

అదేవిధంగా గతంలో ఉన్న గుడికి కొత్తగా నిర్మించిన గుడిలో గల వ్యత్యాసాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు . గర్భగుడి అంతటాలయం ఎంత స్థలంలో నిర్మిస్తున్నారు వివరాలు అడిగి తెలుసుకున్నారు .అక్టోబర్ 29 తేదిన బుధవారం గం.11.18 నిమిషాలకు త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా పునర్నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

కార్యక్రమానికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ గారు, స్తపతి గారు, ఇంజనీర్లు మరియు హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, ఇంజినీరింగ్ సిబ్బంది, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ, సిబ్బంది పాల్గొన్నారు. తొలుత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.