The Desk…Nellore : రెట్టింపు ఉత్సాహంతో భూగర్భ జలాల పెంపునకు కృషి చేయండి : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

The Desk…Nellore : రెట్టింపు ఉత్సాహంతో భూగర్భ జలాల పెంపునకు కృషి చేయండి : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

🔴 నెల్లూరు : ది డెస్క్ :

జల సంరక్షణలో భాగంగా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపునకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయ రెడ్డి..డ్వామా పీడి గంగాభవానితో అన్నారు.

ఈ నెల 18 (మంగళవారం) న న్యూఢిల్లీలో జరిగిన ‘జల్ సంచయ్ – జన్ భగీదారీ’ కార్యక్రమంలో వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాల పెంపునకు చేసిన కృషికి జాతీయ స్థాయి అవార్డును కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ గంగాభవాని కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో డ్వామా పీడీ గంగాభవాని శుక్రవారం రాత్రి స్థానిక సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ సహకారం, సూచనలతో భూగర్భ జలాల పెంపుకు పనిచేసామని..జాతీయ స్థాయిలో అవార్డుతో పాటు రూ.25 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహం జిల్లాకు వచ్చిందని డ్వామా పీడి అన్నారు.

ఈ అవార్డు రాకతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి జిల్లాలో భూగర్భ జలాల పెంపుకు మరింత కృషి చేయాలని మంత్రి ఆనం అన్నారు