The Desk…Nellore : అభిప్రాయాలు సేకరణ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది : మంత్రి ఆనం

The Desk…Nellore : అభిప్రాయాలు సేకరణ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది : మంత్రి ఆనం

నెల్లూరు జిల్లా : నెల్లూరు : ది డెస్క్ :

నెల్లూరు జిల్లా పార్లమెంటు విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన త్రిసభ్య కమిటీ సభ్యులు ఘనంగా ఆహ్వానించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రారంభమైన సమావేశం.

ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ :

తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని ఏర్పాటు చేయడానికి నెల్లూరుకు విచ్చేసిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, దుండి రాకేష్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని నేడు నెల్లూరుకు రావడం జరిగింది. జిల్లాలోని అందరు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు హాజరై వారి వారి అభిప్రాయాలను కమిటీ సభ్యులకు తెలియజేయడం జరిగింది.

అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. అభిప్రాయాలను సేకరించిన అనంతరం రిపోర్ట్ అంత జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కి అందజేయడం జరుగుతుంది
వచ్చిన రిపోర్టు ఆధారంగా నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది

కార్యక్రమంలో త్రిసభ్య కమిటీ సభ్యులుగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తో పాటు జిల్లా స్థాయి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.