NTR జిల్లా : నందిగామ : THE DESK :
నందిగామ సబ్ డివిజన్ ఏసీపీగా తిలక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఏసీపీగా పనిచేసిన రవికిరణ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ పై వెళ్లగా.. శ్రీకాకుళం జిల్లా కాశి బుగ్గ నుండి తిలక్ నందగామ ఏసీపీగా బదిలీపై వచ్చారు.
సబ్ డివిజన్లో ఉన్న సీఐలు, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన ఏసిపి గా బాధ్యతలు చేపట్టిన తిలక్ మాట్లాడుతూ.. డివిజన్లోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలిసింగ్ తో సేవలు అందిస్తామన్నారు.
ఏసిపి ని కలిసిన వారిలో సిఐ వైవివిఎల్ నాయుడు, ట్రాఫిక్ సిఐ సతీష్, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.