The Desk…Nagayalanka : ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు నిర్మాణానికి రూ.13.45 కోట్ల నిధులు మంజూరు : ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

The Desk…Nagayalanka : ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు నిర్మాణానికి రూ.13.45 కోట్ల నిధులు మంజూరు : ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

కృష్ణా జిల్లా : నాగాయలంక : THE DESK NEWS :

నాగాయలంక మండలం ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు నిర్మాణానికి రూ.13 కోట్ల 45 లక్షలు మంజూరైనట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణానది వరదల ప్రభావానికి పూర్తిగా కోతకు గురైన ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు సమస్యను ఇటీవల తాను, జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి సమస్యను వీడియో తీయించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించారని ఎమ్మెల్యే తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు కింద ఆసియా ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నిధులు రూ.13 కోట్ల 45 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. ఎదురుమొండి నుంచి బ్రహ్మయ్యగారిమూల మీదుగా గొల్లమంద వరకు కరకట్ట బలోపేతం, నూతన రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గొల్లమంద రోడ్డు నిర్మాణంతో పాటు, ఎదురుమొండి దీవుల పరిరక్షణకు దోహదం చేసేలా నిధులు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ధన్యవాదములు తెలిపారు.