🔴 ఎన్టీఆర్ జిల్లా : మైలవరం : ది డెస్క్ :
ఆంద్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) ఆధ్వర్యంలో ఆ శాఖ నాయకులు, సభ్యులు కలిసి “డిమాండ్స్ డే” కార్యక్రమాన్ని మంగళవారం మైలవరంలో నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్వో అబ్దుల్ దరియాకి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ప్రధానంగా కాల వ్యవధిని పొడిగించకుండా…
1) అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కి అక్రిడిటేషన్ మంజూరు చేయాలి.
2) జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ పునరుద్దరించాలి.
3) జీఓ విడుదల చేసి కూటమి ప్రభుత్వ గత హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలి.
4) రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల్లో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
5) వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ని ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలి మరియు స్కీమ్ లో ఎదురౌతున్న సమస్యలు పరిష్కరించాలి. వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రమాద భీమా పధకాన్ని పునరుద్దరించాలి.
6) ఇతర రాష్ట్రాల మాదిరి మన రాష్ట్రంలో కూడా పాత్రికేయుల ఫించన్ పధకాన్ని అమలు చేయాలి.
ఇలా 6 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కి అందించి, అందలి అంశాలను ఆంద్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ యు. వెంకట్రావు ఎమ్మార్వో అబ్దుల్ దరియా కి విశదీకరించి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాల్సిందిగా కోరారు. తహశీల్దార్ అబ్దుల్ దరియా సానుకూలంగా స్పందించి తమ ద్వారా వినతి పత్రాన్ని ఉన్నత అధికారులు తద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ యు. వెంకట్రావు, యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చండీ నాగ ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు మన్నే శ్రీను, యూనియన్ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు జబ్బార్, రాజారెడ్డి, మురళి బాబు, మన్నే సాంబశివరావు, వైడీపీ రెడ్డి, బుద్దవరపు వెంకట్రావు, వైవీ కృష్ణ ప్రసాద్, రామకృష్ణ, యూనియన్ సభ్యులు, జర్నలిస్ట్ మిత్రులు బాలు, కే.ఎన్.వీ.డీ ప్రసాద్, రాజీవ్ రాజు, జి.అశోక్, జరపల ప్రకాష్, ఎండీ అక్బర్, జి.డేవిడ్, బత్తుల శ్రీనివాసరావు, వజ్రం సురేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.