The Desk …Mydakur : ‎నా కుమారుడు 100 శాతం తప్పు చేయలేదు➖పుట్టా సుధాకర్ యాదవ్ (ఏలూరు ఎంపీ తండ్రి)

The Desk …Mydakur : ‎నా కుమారుడు 100 శాతం తప్పు చేయలేదు➖పుట్టా సుధాకర్ యాదవ్ (ఏలూరు ఎంపీ తండ్రి)

🔴‎ కడప జిల్లా : మైదుకూరు/ఏలూరు : ది డెస్క్ :


‎బ్లడ్ శాంపిల్ తీసుకోకుండానే, బ్లడ్ టెస్టు రిపోర్టు ఎలా వచ్చింది..?

‎ప్రముఖ ల్యాబుల్లో సొంతంగా టెస్టులు

అన్ని రిపోర్ట్స్ నెగెటివ్ – అతి త్వరలోనే నిజాలు వెళ్లడవుతాయి.

‎‎తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మైదుకూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడారు. అనూహ్యంగా తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల తాలూకు తీవ్ర దిగ్బ్రాంతి నుంచి తన కుటుంబం ఇంకా తేరుకోలేదన్నారు. తన కుమారుడు 100 శాతం తప్పు చేయలేదన్న సుధాకర్ యాదవ్, డ్రగ్స్ సహా ఎటువంటి దురలవాట్లు తన కుమారుడికి లేవని స్పష్టం చేశారు.

ఒక డిన్నర్ పార్టీకి వచ్చిన ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన తన కుమారుడు అక్కడి పరిస్థితి గమనించి బయటకు వచ్చేసే లోపే ఈగల్ టీమ్ పోలీసులు వచ్చి డ్రగ్స్ చెకింగ్ చేయాలని చెప్పి పోలీసుల సమక్షంలోనే యూరిన్ శాంపిల్ తీసుకున్నారని, 10 నిమిషాల తర్వాత పుట్టా మహేష్ కుమార్ కి నెగెటివ్ వచ్చిందని ఐదుగురికి మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పడం ప్రజలంతా చూసారన్నారు. కొద్దిసేపటి తర్వాత మరోసారి శాంపిల్ తీసుకోవాలని చెబుతూ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి మళ్ళీ యూరిన్ శాంపిల్స్ మాత్రమే  తీసుకున్నారన్నారు.

శాంపిల్స్ తీసుకున్న ఐదు గంటల తర్వాత ఎస్పీ మీడియా ముందుకు వచ్చి, బ్లడ్ శాంపిల్స్ లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పాజిటివ్ వచ్చిందని విచిత్రంగా ప్రకటించడం చూస్తే, దీని వెనుక  కుట్ర కోణం వంటిది ఏదో ఉందని తెలిసిపోతోందన్నారు. బ్లడ్ శాంపిలే తీసుకోకుండా, బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చిందని ఏవిధంగా నిర్ధారించారో పోలీసులే చెప్పాలన్నారు. మొదటిసారి తీసిన యూరిన్ రిపోర్ట్ 10 నిమిషాల్లోనే బయటపెట్టగా, రెండో సారి తీసుకున్న యూరిన్  శాంపిల్ రిపోర్టు ఐదు గంటల తర్వాత బయటపెట్టడం కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు.  

‎ఈ సందర్బంగా, తన కుమారుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు 2021వ సంవత్సరంలో హార్ట్ సర్జరీ చేసి స్టంట్ వేసిన విషయాన్ని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మీడియాకు వివరించారు. ఆ సమయంలో డాక్టర్ హార్ట్ లో కొన్ని వెజల్స్ వీక్ గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.  హార్ట్ పల్స్ 120 దాటకుండా చూసుకోవాలని, 120 దాటితే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పారన్నారు.

దానిప్రకారంగా ఇప్పటివరకు  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ప్రతి 3 నెలలకోసారి అన్ని ఆరోగ్య టెస్ట్ లు చేసుకుంటూ డాక్టర్స్ సలహాలు, సూచనలు పాటిస్తున్నారన్నారు. వైద్య నిపుణులు ఎవరైనా చెప్పేదాని ప్రకారం డ్రగ్స్ తీసుకుంటే మనిషి హార్ట్ పల్స్ 150 నుండి 180 వరకు కొట్టుకుంటుందని, కానీ పోలీసులు పరీక్షలు చేసినప్పుడు పల్స్ 97 మాత్రమే ఉందన్నారు.

డ్రగ్స్ తీసుకుంటే ప్రాణాపాయం అని తెలిసీ తన కుమారుడు డ్రగ్స్ ఏ విధంగా తీసుకుంటాడని సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు. పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అక్కడ AMPHETAMINE మరియు MATHA AMPHETAMINE  అనే డ్రగ్స్ ఆనవాలు ఉన్నాయని చెప్పారని, హార్ట్, షుగర్ వంటి వాటి కోసం తీసుకునే మందుల వల్ల కూడా అటువంటి రిపోర్టు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ప్రఖ్యాత Oxford యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరిశోధనలో కూడా తేలిన విషయం గమనించాలన్నారు.

‎పోలీసు విచారణ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్, ఢిల్లీ లోని ప్రముఖ ల్యాబుల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సొంతంగా యూరిన్, రక్త పరీక్షలు చేయించుకోగా అన్ని రిపోర్టుల్లో “నెగెటివ్” గా తేలిందని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ప్రఖ్యాత AIIMS సెంట్రల్ గవర్నమెంట్ ఆస్పత్రిలో కూడా బ్లడ్ టెస్టు చేయించగా 48 గంటల తర్వాత వారు ఇచ్చిన రిపోర్టు చూస్తే డ్రగ్స్ తీసుకోలేదని తేలిందన్నారు.

పోలీసు విచారణ జరుగుతున్న సమయంలో తాము మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించలేని పరిస్థితి ఉందన్న ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, త్వరలోనే తన కుమారుడు పుట్టా మహేష్ కుమార్ నిరపరాధిగా నిరూపించుకుని మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు ఆధారాలతో సహా  వివరంగా చెబుతారన్నారు. పార్టీ అధిష్టానం నుంచి అందిన షోకాజ్ నోటీసుకు ఎంపీ తన వివరణ పంపించారని కూడా సుధాకర్ యాదవ్ తెలిపారు.