ఏలూరు జిల్లా : ముదినేపల్లి/గుడివాడ : THE DESK :
కృష్ణాజిల్లా గుడివాడికి చెందిన శివనాగ ప్రసాద్ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు – వృత్తిరీత్యా తాపీ వర్కర్..
సదరు వ్యక్తికి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వల్ల విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పది రోజుల క్రితం ఆపరేషన్ జరగగా…
ఆర్థికంగా భార్యా, పిల్లలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో..
ఏలూరు జిల్లా ముదినేపల్లి కి చెందిన డాక్టర్ మనోజ్ వీరిని కలిసి 5000 రూపాయలు నగదు, 2000 రూపాయలు విలువగల నిత్యవసర సరుకులు ఇచ్చి.. ఆ కుటుంబానికి ఎటువంటి సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయండి.. నేను మీకు సహాయం చేస్తాను అని భరోసా ఇచ్చిన డాక్టర్ మనోజ్..