The Desk…Mudinepalli : తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ వైఖరి ఏమిటి..? – టిడిపి నేత పులవర్తి శ్యామ్ ప్రశ్న

The Desk…Mudinepalli : తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ వైఖరి ఏమిటి..? – టిడిపి నేత పులవర్తి శ్యామ్ ప్రశ్న

  • సిట్ నివేదికపై స్పష్టత ఇవ్వాలంటూ విమర్శలు

ఏలూరు : ముదినేపల్లి : (ది డెస్క్):

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు సిట్ స్పష్టంగా పేర్కొన్నదని, ఆ విషయాన్ని వైసీపీ ఒప్పుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని ఏలూరు జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పులవర్తి శ్యామ్ విమర్శించారు.

ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లడ్డూ ప్రసాదంలో రసాయనాలు ఉన్నట్లు తేల్చిన విషయం నిజం కాదా అని వైసీపీని ప్రశ్నించారు.

రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాస్తవాలను వక్రీకరిస్తోందని శ్యామ్ ఆరోపించారు. పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ చేయడం ద్వారా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికైనా వైసీపీ తమ వైఖరిని పునఃపరిశీలించి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి క్షమాపణ చెప్పాలని శ్యామ్ హితవు పలికారు. కూటమి ప్రభుత్వంపై ఆధారరహిత ఆరోపణలు చేస్తే సహించబోమని ఆయన స్పష్టం చేశారు.