The Desk… Mudinepalli : జగన్నాధుని ఆలయ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం

The Desk… Mudinepalli : జగన్నాధుని ఆలయ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం

భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం : ట్రస్టీ నాగరాజు

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

చినపూరిగా పేరుగాంచిన ముదినేపల్లి మండలంలోని వడాలిలో వేంచేసి ఉన్న శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాధ స్వామి ఆలయ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని, కైకలూరు ఎమ్మెల్యే డా. శ్రీనివాస్ సూచన మేరకు, ఆలయ అధికారులు, సిబ్బందితో కలిసి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆలయ ట్రస్టీ, ముదినేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిలకలపల్లి నాగరాజు పేర్కొన్నారు. జగన్నాధుని ఆలయ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. తనను స్వామివారి ఆలయ ట్రస్టీగా నియమించిన ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ తోపాటు, అందుకు సహకరించిన ఎన్డీఎ కూటమి నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభసంతరించుకునేలా ఏర్పాట్లు చేస్తూ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఉత్సవాలు, పండుగలు నిర్వహిస్తామన్నారు.

సనాతన ధర్మ పరిరక్షణకు తమ కమిటీ అంతా కలిసికట్టుగా ముందుకుసాగుతుందని ఈ సందర్భంగా నాగరాజు పేర్కొన్నారు. అదేవిధంగా, మీడియా ప్రతినిధిగా తన తోటి మీడియా ప్రతినిధులతో కలిసి ఆలయ విశిష్టతను, స్వామివారి దివ్య చరితను భక్తులకు అందించేందుకు మీడియా ద్వారా తమవంతు ప్రయత్నం చేస్తామని ఆలయ ట్రస్టీ నాగరాజు పేర్కొన్నారు.

కాగా, నూతన పాలక మండలిగా చైర్పర్సన్ వీరమల్లు రత్నకుమారి, సభ్యులుగా చిలకలపల్లి నాగరాజు, పరసా గంగాధరరావు, గూడవల్లి పద్మావతి, అనగాని వెంకటనరసమ్మ, రాజులపాటి వెంకటేశ్వరమ్మ, కటికల నాగవెంకటకోటేశ్వరరావు, కల్లూరి సుబ్రహ్మణ్యం, గుర్రపు రజిని, నక్కా వెంకట నాగలక్ష్మి, శ్రీనివాసుల వెంకట సత్యనారాయణాచార్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎ. శ్రీనివాస రామచంద్రాచార్యులు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.|