ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK :
చట్ట విరుద్ధంగా అక్రమ మద్యం కలిగి ఉన్నా.. బెల్ట్ షాప్ లో నిర్వహించినా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
ఆయన మాట్లాడుతూ… మండలంలోని వైవాక గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమ మద్యం కలిగి ఉండి బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
నిందితుల వద్ద నుండి 120 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడిలో ఎస్సై వెంట సిబ్బంది ఉన్నారు.