The Desk… Mudinepalli : పెదగొన్నూరులో పేకాట రైడ్ – 8 మంది అరెస్ట్.. రూ.57 వేలు స్వాధీనం

The Desk… Mudinepalli : పెదగొన్నూరులో పేకాట రైడ్ – 8 మంది అరెస్ట్.. రూ.57 వేలు స్వాధీనం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి క్రైమ్ : ది డెస్క్ :

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రజలు జూద క్రీడల వైపు వెళ్లవద్దంటూ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు తమ తీరు మార్చుకోవడం లేదు.

ఈ క్రమంలోనే మండలంలోని పెదగొన్నూరు గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు శనివారం ఆకస్మికంగా రైడ్ నిర్వహించారు. ఈ రైడ్‌లో 8 మందిని అరెస్ట్ చేశారు. అలాగే వారి వద్ద నుంచి రూ.57,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూదం వల్ల కుటుంబాలు నష్టపోవడంతో పాటు, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని.. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే 100కు గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వాలని ఎస్సై కోరారు.