The Desk…Mudinepalli : ముదినేపల్లి మండలాన్ని కృష్ణాజిల్లా లో విలీనం చెయ్యాలని విన్నపము

The Desk…Mudinepalli : ముదినేపల్లి మండలాన్ని కృష్ణాజిల్లా లో విలీనం చెయ్యాలని విన్నపము

ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ముదినేపల్లి : ది డెస్క్ :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యసముఖమునకు ఏలూరు జిల్లా, ముదినేపల్లి మండలాన్ని కృష్ణాజిల్లా లో విలీనం చెయ్యాలని విన్నపము.

కృష్ణాజిల్లాకి పట్టుకొమ్మాలా వున్న ముదినేపల్లి మండలాన్నిగత ప్రభుత్వం రాష్ట్ర విభజనల నూతనంగా ఏర్పాటుచేయబడిన ఏలూరు జిల్లాలో విలీనం చేశారని నాటినుండి కృష్ణాజిల్లాకి దగ్గరగాను, ఏలూరు జిల్లాకి దూరంగాను వున్నందున, ప్రజలుకి అధికారులతో అవసరం వచ్చిన్నా ముదినేపల్లి మండల ప్రజలు ఏలూరు వెళ్లటానికి రహదారుల మార్గము దూరమై చాలా ఇబ్బందులతో కూడుకొని ప్రజలు,, అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతులు, ఆక్వా రైతులకి సంభందించిన నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రజలకు త్రాగునీటి సమస్యలు వలన అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, కృష్ణా నది జలాల మపుళ్ళింపులోకూడా నది జలాలు అందక, గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులు చేయకపోవటం చేతనూ నీటి కొరత ఉందని, అధికారిక పనులకోసం ప్రజలకు మచిలీపట్నంలోగల జిల్లా అధికార కార్యాలయాలు కి వెళ్ళటాననికి రహదారి మార్గం అనుకూలమైనదని, యవత చదుకొనేందుకు విద్యాలయాలు దగ్గరగా ఉన్నాయనియూ, విద్యార్ధిని, విద్యార్థుల తల్లి, తండ్రులు కూడా కోరుతున్నారని, నాదృష్టికి వచ్చినందున ప్రజలకు మేలు జరుగుతుందని భావించి తమరి వద్దకు వచ్చి వినతి పత్రం ద్వారా విన్నావిస్తున్నామని త్వరితగతిన ముదినేపల్లి మండలాన్ని మరళా కృష్ణాజిల్లాలో కలపటానికి ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకోవాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, డాక్టర్ మనోజ్ లు మంత్రి నారాయణ వివరించామని మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారు. సిఎం చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా స్పందించి ముదినేపల్లి మండలాన్ని కృష్ణాజిల్లాలో వినీలం చేయాలని కోరుతున్నాను.