🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

పెదపాలపర్రు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ముడిదొడ్డి వీర్రాజు తీవ్ర అనారోగ్యసమస్యతో గత కొంతకాలంగా మంచం మీద ఉంటూ.. ఈ రోజు తెల్లవారు ఝామున మరణించారని… అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవికి సదరు విషయం తెలిసి తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా 5000/- రూపాయలు దహన సంస్కారాలు నిమిత్తం ఆర్థిక సాయం అందించి మృతుని కుటుంబానికి డాక్టర్ మనోజ్ ప్రఘాడ సానుభూతిని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంటా రాకేష్ కుమార్ డాక్టర్ మనోజ్ కి కూలి పనులు చేసుకొంటూ జీవిస్తున్నారని, నిరుపేద కుటుంబానికి చెందిన వారని,చాలా కాలం నుండి అనారోగ్యంతో భాదపడుతూ వైద్య ఖర్చులు కోసం డబ్బు చాలా ఖర్చుపెట్టి ప్రస్తుతం ఇల్లు గడవటం కూడా కష్టమవుతోందని డాక్టర్ మనోజ్ కి తెలియచేసారు.
అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ లు నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడి ఆర్థిక సహాయ,సహకారాలు అందిస్తూన్నారని, వారి ఋణం తీర్చుకోలేనిదని గ్రామ సర్పంచ్ గంటా రాకేష్ అన్నారు, డాక్టర్ మనోజ్, అంబుల వైష్ణవిలకు మృతుని కుటుంబ సభ్యులు,కాలని వాసులు ధన్యవాదాలు తెలియచేసారు.
Ambul Vaishnavi Aids Impoverished Family with Funeral Aid in Mudinepalli
A touching act of compassion unfolded in Pedapalaparru village when Amravati brand ambassador Ambul Vaishnavi extended ₹5,000 financial aid for the funeral rites of Mudidoddi Veerraju, a daily wage laborer from a poor family who succumbed to prolonged illness early morning.
Vaishnavi’s father, Dr. Manoj, delivered the aid and conveyed condolences. Village sarpanch Ganta Rakesh Kumar highlighted Veerraju’s struggles with medical expenses, noting, “Dr. Manoj and Vaishnavi stand as pillars for the needy—their help is invaluable.
“The duo’s ongoing support for underprivileged families earned gratitude from the bereaved kin and villagers.

