🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : అల్లూరు : ది డెస్క్ :

అల్లూరు గ్రామానికి చెందిన తోట నాగరాజుకు చెందిన రెకుల షెడ్డు ఈరోజు ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా షెడ్డుకు నిప్పంటుకొని, ఇంట్లో ఉన్న బట్టలు, వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో చుట్టుపక్కల వారి సహాయంతో మంటలను అదుపు చేయగా అప్పటికే లోపల సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతవ్వగా..సుమారుగా లక్ష రూపాయలు పైచిలుకు
నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా.
విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ కుమార్ మానవతా దృక్పథంతో బాధిత కుటుంబమైన తోట నాగరాజు దంపతులకు తన వంతుగా 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ..
తనకున్న దానిలో తోచిన సహాయం అందించానని.. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తోటి వారి కష్టాలను చూసి చేతనైన సహాయం చేయాలని సూచించారు.
In a heartwarming act of humanity, Dr. Manoj Kumar, father of Amaravati brand ambassador Ambula Vaishnavi, extended financial aid to a family devastated by fire in Alluru village, Mudinepalli Mandal.
This morning, a short circuit ignited a cattle shed owned by Tota Nagaraju while the family was away. Flames rapidly consumed clothes and household items inside, causing an estimated loss exceeding ₹1 lakh. Neighbors rushed to douse the blaze, but the damage was extensive.
Learning of the tragedy, Dr. Manoj promptly handed over ₹5,000 to Nagaraju and his wife. “I gave what I could from my means,” he said, urging everyone to help fellow villagers in distress whenever possible.

