The Desk…Mudinepalli : కిడ్నీ సమస్యతో మరణించిన పేద మహిళ కుటుంబీకులకు రూ.5000/- లు ఆర్థిక సాయం అందించిన వైష్ణవి డాక్టర్ మనోజ్

The Desk…Mudinepalli : కిడ్నీ సమస్యతో మరణించిన పేద మహిళ కుటుంబీకులకు రూ.5000/- లు ఆర్థిక సాయం అందించిన వైష్ణవి డాక్టర్ మనోజ్

ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ :

మండలంలోని వడాలి గ్రామంలో పేద మహిళ ఇందుపూరి పాపయ్యమ్మ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా (55) సోమవారం మరణించింది. ఈ దుఃఖ సమయంలో..అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి అందించిన మానవత్వం పలువురి హృదయాలను తాకింది.

వడాలి గ్రామానికి చెందిన ఇందుపూరి పాపయ్యమ్మ గత కొంతకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధితో బాధపడుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. పాపయ్యమ్మ కి పదేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో, అప్పటినుండి ఆమె తన పిల్లలతో కలిసి పేదరికంతో జీవనం సాగిస్తోంది.

అత్యంత పేదరికం కారణంగా ఆమె కుటుంబం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. విషయాన్ని తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, తండ్రి మనోజ్ వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో వైష్ణవి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు.

పాపయ్యమ్మ దహన సంస్కారాల కోసం ఆమె తక్షణ సహాయంగా ఐదు వేల రూపాయలు (₹5000/-) ఆర్థిక సాయాన్ని అందించారు. వైష్ణవి అందించిన ఈ సహాయం పాపయ్యమ్మ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్థానికులు డాక్టర్ మనోజ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.