The Desk…Mudinepalli : అమరావతికి జీవం పోద్దాం… రూ.116/లు సాయం చేద్దాం : అంబుల వైష్ణవి, డా. మనోజ్

The Desk…Mudinepalli : అమరావతికి జీవం పోద్దాం… రూ.116/లు సాయం చేద్దాం : అంబుల వైష్ణవి, డా. మనోజ్

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

మండలంలోని శ్రీహరిపురం గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది ఐన పారిశుద్ధ్య కార్మికుల పాదములను కడిగి, పూదండలతోనూ, శాలువాతోను సత్కరించి, అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ముదినేపల్లికి చెందిన ప్రముఖ డాక్టర్ మనోజ్, శ్రీహరిపురం గ్రామ సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సమక్షంలో కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది.

సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపు మేరకు పల్లెటూర్లలోనే కాక పట్టణాల్లోనూ, జిల్లాల నుండి ,రాష్ట్రాల నుండి, పొరుగు రాష్ట్రాల నుండి, పొరుగు దేశాల నుండి ప్రజలు అమరావతి నిర్మాణంలో భాగస్వాములగుట కొరకు ఎవరికి వారి శక్తి కొలది 116/- 1,116/-, 10,116/- రూపాయలు అమరావతి నిర్మాణానికై విరాళాలు ఇవ్వడానికి తమ వంతుగా సహకరిస్తున్న తీరుకు .. నా కుమార్తె అంబుల వైష్ణవి, వైద్యుడనైన నేను మీ ఎడల కృతజ్ఞుడను. మీ అందరి సహకారంతో ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికై విద్యార్థులు విద్యావంతులు, ఉద్యోగులు, రైతులు ,పారిశ్రామికవేత్తలు ఇలా ప్రతి ఒక్కరు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీహరిపురం గ్రామంలోని సచివాలయ సిబ్బంది గ్రీన్ అంబాసిడర్స్ (పారిశుధ్య కార్మికులు) ఒక్కొక్కరు 116 రూపాయలు చొప్పున CRDA ఎకౌంటుకు విరాళం అందించినందుకు గాను.. కృతజ్ఞుడనై వారి పాదములను కడిగి వారిని సన్మానించడం జరిగింది.

ఇప్పటికే ఉప్పెనలా… అమరావతికి జీవం పోద్దాం – 116/-రూపాయలు సాయం చేద్దాం … ఈ కాన్సెప్ట్ రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలకు, దేశాలకు, వ్యాపించి విరాళాలు ఇవ్వడం చాలా సంతోషమని, మన అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తే అమరావతి రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

ఈ సందర్భంగా శ్రీహరిపురం గ్రామపంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ… అంబుల వైష్ణవి పిలుపుమేరకు ప్రతి ఒక్కరు 116/- రూపాయలు చెల్లించి అమరావతి నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

సందర్భంగా శ్రీహరిపురం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. డాక్టర్ మనోజ్, వారి కుమార్తె వైష్ణవి ముదినేపల్లి గ్రామంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా మేము ఉన్నామoటూ వారికి భరోసా ఇస్తూ వారికి నగదు, నిత్యవసర సరుకులు ఇవ్వటమే కాకుండా, భావితరాల కోసం ఎవరికీ రాని ఆలోచన 116/-రూపాయలు అమరావతి నిర్మాణానికి చెల్లిద్దామని, అందులో భాగంగా గ్రామ సచివాలయంలోని కార్మికులు అమరావతి నిర్మాణానికి CRDA అకౌంట్ కి నగదు విరాళం చెల్లించినందుకుగాను వారిని సన్మానించి, వారి కాళ్లు కడిగి ఎన్నో కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన వీరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అని ఆయన తెలిపారు.