The Desk…Mudinepalli : మండలంలో పల్లె పండగ వారోత్సవాలు

The Desk…Mudinepalli : మండలంలో పల్లె పండగ వారోత్సవాలు

ఏలూరు జిల్లా, ముదినేపల్లి : THE DESK :

రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు పల్లె పండగ వారోత్సవాలలో భాగంగా మండల తెదేపా నేతలు పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపనలు చేశారు.

మండలంలోని బొమ్మినంపాడు పంచాయతీ, వనుదుర్రు పంచాయతీ, దేవపూడి పంచాయతీల పరిధులలో నరేగా నిధులతో మంజూరైన సీసీ రోడ్లకు కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వీరమల్ల నరసింహారావు, పర్యాటక అభివృద్ధి శాఖ డైరెక్టర్ కోడాలి వినోద్ లు శంకుస్థాపనలు చేశారు.

కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, N.D.A కూటమి నాయకులు పాల్గొన్నారు.