The Desk…Mudinepalli : అమరావతికి జీవం పోద్దాం – 116/- సాయం చేద్దాం

The Desk…Mudinepalli : అమరావతికి జీవం పోద్దాం – 116/- సాయం చేద్దాం

  • వైష్ణవి ఇచ్చిన పిలుపు మేరకు..
  • మేము సైతం అంటున్న పొరుగు రాష్ట్రాలు – పొరుగు దేశాలు
  • రాజధాని నిర్మాణానికి NRI రూ.10,116/- విరాళం

హర్షం వ్యక్తం చేసిన వైష్ణవి

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

ఏపీ రాజధాని నిర్మాణానికి నిధుల సేకరణకు అమరావతి బ్రాండ్ అంబాసిడర్, ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రజలందరినీ రాజధాని నిర్మాణంలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ఒకొక్కరు రూ. 116/-లు విరాళం ఇవ్వాలని వైష్ణవి ఇచ్చిన పిలుపునకు స్పందన లభిస్తున్నది. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు చెందిన వారు రూ.116/- నుంచి రూ.5116/-వరకు ఏపీ సీఆర్డీఏ అకౌంట్ కు పంపిస్తున్నారు.

శుక్రవారం ముదినేపల్లికి చెందిన NRI గూడవల్లి వెంకట సత్యకుమార్ రూ.10,116/-లు విరాళంగా ఇచ్చారు.

ఆయన ఈ మొత్తాన్ని అమెరికా నుంచి CRDA క్యూఆర్ కోడ్ ద్వారా అకౌంట్ కు పంపారు.ఈ సందర్భంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబులివైష్ణవి విరాళం ఇచ్చిన దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా విదేశాల నుండి కూడా అమరావతి నిర్మాణంలో బాగస్వాములగుట కొరకు దాతలు ముందుకు రావడంతో, సహకరించడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.