🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలo : ది డెస్క్ :
ముదినేపల్లికి చెందిన ప్రైవేటు వైద్యుడు అంబుల మనోజ్ కు “రితిక ఫౌండేషన్స్ నంది అవార్డు” అందించింది.

విజయవాడ ఆటోనగర్ లో ఆదివారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఫౌండర్ నిత్యానందచారి, డీఎస్పీ శ్రీనివాసరావు, సినీ నటి ఎం.జగదీశ్వరి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళం ఇవ్వటమే కాకుండా…తన కుమార్తె అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, ఇద్దరూ కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున
నంది అవార్డు దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ కు గ్రామస్తులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, పాత్రికేయులు శుభాకాంక్షలు తెలియజేశారు.