- చేయి చేయి కలుపుదాం – కలల రాజధాని నిర్మిద్దాం.!!
- ₹116/- చెల్లిద్దాం – రాజధాని నిర్మాణంలో భాగస్వాములవుదాం..!!
➖ పిలుపునిచ్చిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

అమరావతి రాజధాని నిర్మాణానికి, నూతన రాష్ట్ర సచివాలయ భవనాల నిర్మాణానికి గతంలో రూ.50 లక్షల విరాళం ఇచ్చిన ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ప్రతి ఒక్కరూ కూడా విరాళాలు అందించాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వాములవ్వాలని కోరారు.
ఎకరంన్నర పొలం, బంగారం అమ్మి రాజధాని నిర్మాణానికి విరాళాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్ తో కలసి అందజేసిన విషయం తెలిసిందే..
ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యే విధంగా “అమరావతికి జీవం పోద్దాం – రూ.116లు సాయం చేద్దాం” అనే నినాదంతో ఆమె విరాళాలు అందజేయాలంటూ పిలుపునిచ్చారు.
విరాళాలు ఇచ్చే వారు కమిషనర్ ఏపీసీఆర్డీఏ, యూనియన్ బ్యాంక్, విజయవాడ లబ్బీపేట బ్రాంచి పేరుమీద పంపించవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు.
For Online Transfer of Funds through Neft/RTGS
Beneficiary Name: Commissioner, APCRDA
Bank : Union Bank Of India
Branch : Labbipet Vijayawada
Account No : 034310100118883
IFS Code : UBIN0803430
For D.D/Cheque Payment
In Favor of : Commissioner, APCRDA
Payable at : Vijayawada

