🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ముదినేపల్లి : ది డెస్క్ :

గ్యాస్ సిలిండర్ పేలి యిల్లు మొత్తం కాలిపోయి రోడ్డున పడిన కుటుంబానికి అండగా నేనున్నాను అంటూ.. అంబుల వైష్ణవి ముందుకు వచ్చి సహాయం చేశారు.
ముదినేపల్లి మండలం వనుదురు గ్రామానికి చెందిన అల్ల వీరుడు(80) తన యింట్లో గ్యాస్ సిలిండర్ పేలి యిల్లు మొత్తం పూర్తిగా కాలిపోయి నిరాశ్రయుడవ్వగా.. విషయాన్ని తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తక్షణ సహాయం కింద వెంటనే తండ్రి డాక్టర్ మనోజ్ చేతుల మీదుగా ₹5000 రూపాయలు నగదును మరియు నిత్యావసర సరుకులు అందించి బాధితుడికి అండగా నిలిచారు.