The Desk…Mudinepalli : వీరయ్య కుటుంబానికి అంబుల వైష్ణవి రూ.5000 సాయం

The Desk…Mudinepalli : వీరయ్య కుటుంబానికి అంబుల వైష్ణవి రూ.5000 సాయం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

మండలంలోని వాడాలి గ్రామానికి చెందిన ఆవుల వీరయ్య (25) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడు వీరయ్య రోజు కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవాడు.

ముదినేపల్లికీ చెందిన ప్రముఖ ప్రయివేటు వైద్యుడు మనోజ్ కుమార్తె, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఆంబుల వైష్ణవి కి విషయం తెలియడంతో తన తండ్రి ద్వారా వీరయ్య దహన సంస్కారాలు నిమిత్తం రూ.5 వేలు అందజేశారు. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తానున్నానంటూ పేద కుటుంబానికి వైష్ణవి భరోసా ఇచ్చారు. సాయం అందించిన డా.మనోజ్, కుమార్తె వైష్ణవినీ స్థానికులు అభినందించారు.