ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

మండలంలోని వడాలి, పెద్ద కామనపూడి, చిన్న కామనపూడి, చిగురుకోట గ్రామాలలో నరేగా నిధులు ద్వారా మంజూరైనా సీసీ రోడ్లను కైకలూరు శాసనసభ్యుడు, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రతి పల్లెకు పండుగ వాతావరణం తెచ్చిందనీ.. ఏ గ్రామములోనూ ప్రజలు మట్టిలో నడవకూడదు అనే నినాదంతో ప్రతి రోడ్డు సీసీ రోడ్డు అయ్యి ఉండాలని.. రాష్ట్రంలోను మరియు కేంద్రం లోను అత్యధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. ప్రజలందరు కూటమి పాలనలో సుఖసంతోషాలతో వుంటున్నారని తెలిపారు.
కార్యక్రమంలో నియోజకవర్గం టిడిపి కన్వినర్ వీరమల్లు నరసింహారావు, NDA నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.