The Desk…Mudinepalli : శ్వాసకోస వ్యాధితో మృతి చెందిన రామోజీ కుటుంబానికి అంబుల వైష్ణవి ఆర్థిక సాయం

The Desk…Mudinepalli : శ్వాసకోస వ్యాధితో మృతి చెందిన రామోజీ కుటుంబానికి అంబుల వైష్ణవి ఆర్థిక సాయం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

మండలంలోని కొర్రగుంట గ్రామానికి చెందిన గుడిసెట్టి రామోజీ(35) శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, 15 సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ముదినేపల్లికీ చెందిన ప్రముఖ ప్రయివేటు వైద్యుడు మనోజ్ కుమార్తె, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఆంబుల వైష్ణవి కి విషయం తెలియడంతో తన తండ్రి ద్వారా గుడిశెట్టి రామోజీ దహన సంస్కారాలు నిమిత్తం రూ.5 వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయం అందించిన డా.మనోజ్, కుమార్తె వైష్ణవినీ స్థానికులు అభినందించారు