The Desk…Mudinepalli : వెంకటరత్నం కుటుంబానికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి సాయం

The Desk…Mudinepalli : వెంకటరత్నం కుటుంబానికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి సాయం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK :

మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన వీర్ల వెంకటరత్నం(38) గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత అనరోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు.

ముదినేపల్లికీ చెందిన ప్రముఖ ప్రయివేటు వైద్యుడు మనోజ్ కుమార్తె, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఆంబుల వైష్ణవి కి విషయం తెలియడంతో తన తండ్రి ద్వారా వేంకటరత్నం దహన సంస్కారాలు నిమిత్తం రూ.5 వేలు బాధితుల కుటుంబానికి అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. సాయం చేసిన డా.మనోజ్, కుమార్తె వైష్ణవికి బాధిత కుటంబం కృతజ్ఞతలు తెలిపింది.