🔴 THE DESK NEWS : ఏలూరు జిల్లా : కైకలూరు నియోజకవర్గం : ముదినేపల్లి :
పిట్ట కొంచెం కూత ఘనమ్ అనే సామెత రీతిగా.. ముదినేపల్లిలోని వైద్య విద్యను అభ్యసిస్తున్న అంబుల వైష్ణవి తన చిన్నతనం నుండి తండ్రి డాక్టర్ మనోజ్ లోని సేవా గుణాన్ని అలవర్చుకుని, తండ్రి సహకారంతో నిత్యం నేటికీ ఎన్నో – ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో విద్యార్థులు మత్తుమందులకు, మద్యానికి, చెడు వ్యసనాలకు లోనై జీవితాలు దుర్బరం చేసుకుంటున్న నేపథ్యంలో అంబుల వైష్ణవి దీనికి భిన్నంగా నేటి జనరేషన్లో కూడా ఉంటూ.. పేదలకు ,దిక్కులేని వారికి, వితంతువులకు, అభాగ్యులకు సేవ చేయడమే తన వృత్తిగా ఎంచుకుని.. వారి సొంత ఆస్తులని అమ్మి అవసరమైన వారికి, పేదలకు నగదు, నిత్యవసర సరుకులను ఇస్తూ.. నేనే కాకుండా ఇంకా మరి కొంతమంది సేవా గుణం అలవర్చుకొని ఇతరులకు సహాయపడాలని హితవు పలుకుతూ.. ముందుకు సాగుతుంది.
ఈ నేపథ్యంలో వైష్ణవి ఈ నూతన సంవత్సరం 2025 లో మరొక ముందడుగు వేస్తూ… ఇప్పుడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తన ఆలోచన విధానం అభినందించాల్సిన గొప్ప విషయం.
2025 నూతన సంవత్సరం ఆరంభంగా ప్రత్యేక వ్యక్తులతో “ది డెస్క్ న్యూస్” ప్రతినిధి /ఎడిటర్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో భాగంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తో ముచ్చటించారు.
అమరావతి బ్రాండ్ అంబాసిడర్ తో – ది డెస్క్ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ..‼️
▪️ ది డెస్క్ ప్రతినిధి (ప్రశ్న) : వైష్ణవి – 2025 ఎలా ఉండాలని మీరు ఆశిస్తున్నారు❓
అంబుల వైష్ణవి (సమాధానం) : 2025 నూతన సంవత్సరంలో అమరావతి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని , పరిశ్రమలు రావాలని , పోలవరం త్వరితగతిన పూర్తి కావాలని , ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని , రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమ ఫలాలు , సంక్షేమ పథకాలు అందుకుని క్షేమంగా జీవించాలి.
▪️ ది డెస్క్ ప్రతినిధి (ప్రశ్న) : రాష్ట్ర ప్రజలు ఈ నూతన సంవత్సరంలో ఏమి ఆశిస్తున్నారు.❓
అంబుల వైష్ణవి (సమాధానం) : రాష్ట్రాన్ని ప్రగతి పథంలో అభివృద్ధి దిశగా.. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో, అత్యున్నత స్థాయిలో ఉంచాలని …ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబు ఒక్కరి వల్లే జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు.
▪️ ది డెస్క్ ప్రతినిధి (ప్రశ్న) : మీ ముదినేపల్లి మండలానికి సేవా కార్యక్రమాల్లో భాగంగా మీరు ఏమి చేయాలని ఆశిస్తున్నారు..❓
అంబుల వైష్ణవి (సమాధానం) : ముదినేపల్లి మండలాన్ని పూర్వపు మాదిరి కృష్ణాజిల్లాలో చేర్చాలని మండల ప్రజలందరూ ఆశిస్తున్నారు కాబట్టి హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్లి , ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను.
▪️ ది డెస్క్ ప్రతినిధి (ప్రశ్న) : ఈ ఏదాదిలో మీరు చేసే అతి ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏమిటి❓
అంబుల వైష్ణవి (సమాధానం) : రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ సంవత్సరంలో తన స్వగ్రామం ముదినేపల్లిలో.. తన ఇంటి ఆవరణంలో ఉన్న ఏడుకొండలవారి సన్నిధిలో .. రాజశ్యామల యాగం చేసే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వచ్చి, ఈ గొప్ప పూజా కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదిస్తారని, సీఎం దంపతుల పాదములు కడిగి వారి ఆశీర్వచనములు పొందాలనే తన కోరిక నెరవేరాలని “అంబుల వైష్ణవి“(అమరావతి బ్రాండ్ అంబాసిడర్ మరియు వైద్య విద్యార్థిని )”ది డెస్క్” ప్రతినిధికి సమాధానమిచ్చారు.
www.thedesknews.net