The Desk…Mopidevi : మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవలో మంత్రి కొల్లు

The Desk…Mopidevi : మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవలో మంత్రి కొల్లు

కృష్ణాజిల్లా : అవనిగడ్డ నియోజకవర్గం : మోపిదేవి : ది డెస్క్ :

ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజుల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.

ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి వారి మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు రవీంద్రను ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. ఆగస్టు 15 తారీఖున కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి దోహదపడుతుందన్నారు.