The Desk…Maredumilli : వెదురు పెంపకం ద్వారా ఉపాధి హామీ శ్రామికులకు లబ్ది ➖ ఏపిడి శ్రీనివాస విశ్వనాధ్

The Desk…Maredumilli : వెదురు పెంపకం ద్వారా ఉపాధి హామీ శ్రామికులకు లబ్ది ➖ ఏపిడి శ్రీనివాస విశ్వనాధ్

అల్లూరి జిల్లా : మారేడుమిల్లి : ది డెస్క్ :

ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఉపాధి హామీ పథకం సహకారంతో వెదురు మొక్కల పెంపకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత కల్పిస్తున్నాయని, భూమి ఉండి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్నవారు తప్పక ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.

మంగళవారం స్థానిక అడిషనల్ ప్రోగ్రాం అధికారి కార్యాలయంలో ఉపాధి, వెలుగు సిబ్బందితో సమీక్షా నిర్వహించి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సందర్బంగా శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ… మారేడుమిల్లి మండలంలో సుమారు 300 ఎకరాలలో 1000 మంది లబ్దిదారులకు ఉపయోగపడేలా వెదురు మొక్కల పెంపకం చేపట్టడం జరుగుతుందని, ఇప్పటికే కలెక్టర్ దినేష్ కుమార్ ఈ విషయంలో ఆదేశాలు జారిచేసి లబ్దిదారులను గుర్తించమన్నారని ఏపీడీ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.

సమావేశంలో ఏపీఓ మాణికుమారి, ఏపీఎం డిఆర్డిఏ దుర్గాప్రసాద్, ఉపాధిహామీ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.