The Desk…Mangalagiri Town : మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనదారులపై చర్యలు తప్పవు : పట్టణ ఎస్సై రవీంద్ర నాయక్

The Desk…Mangalagiri Town : మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనదారులపై చర్యలు తప్పవు : పట్టణ ఎస్సై రవీంద్ర నాయక్

  • రోడ్డు భద్రత నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
  • మంగళగిరి పట్టణ ఎస్సై రవీంద్ర నాయక్ హెచ్చరిక.
  • పెండింగ్ లో ఉన్న వాహన చలానాలు కట్టించేందుకు స్పెషల్ డ్రైవ్.

గుంటూరు జిల్లా : మంగళగిరి టౌన్ : ది డెస్క్ :

ద్విచక్ర వాహన చోదకులు, నాలుగు చక్రాల వాహనాలలో ప్రయాణం చేసే వారు విధిగా రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని మంగళగిరి పట్టణ ఎస్సై రవీంద్ర నాయక్ సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న వాహన చలానాలను వసూలు చేసేందుకు పట్టణ ఎస్ఐ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పాత బస్టాండ్ సెంటర్లో మంగళవారం సాయంత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నిబంధనలను పాటించకుండా రాకపోకలు సాగించిన వారికి చలానా లు విధించడం జరిగిందని.. గతంలో విధించిన ఈ వాహన చలానాలలో కట్టకుండా తిరిగే వారి వద్ద నుంచి వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఇటీవల జరిగిన, జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది కేవలం నిబంధనలు పాటించకపోవడం కారణంగానే ప్రాణాలను విడిచారని ఆయన అన్నారు. దీని వలన కుటుంబానికి కన్నీటి వ్యధ మిగులుతుందని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే వారు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాలలో వెళ్లేవారు సీటు బెల్టు విధిగా ధరించాలని సూచించారు.

ద్విచక్ర వాహనంపై ఇద్దరుకు మించి ప్రయాణించకూడదని తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరిమితికి మించిన వేగంగా వెళ్లకూడదన్నారు. నిబంధనలను పాటించి సహకరించాలని ఆయన కోరారు. డ్రైవ్ లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.