The Desk…Mangalagiri : మద్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు.. షాపులు సీజ్ : జిల్లా ఎక్సైజ్ ఎస్పీ శ్రీనివాసులు హెచ్చరిక

The Desk…Mangalagiri : మద్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు.. షాపులు సీజ్ : జిల్లా ఎక్సైజ్ ఎస్పీ శ్రీనివాసులు హెచ్చరిక

గుంటూరు జిల్లా : మంగళగిరి : ది డెస్క్ :

మద్యం అధిక ధరలకు విక్రయిస్తే షాపులను సీజ్ చేస్తామని, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాప్ యజమానులపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు హెచ్చరించారు.

మంగళగిరి ఎక్సైజ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకటించిoదని, అందులో భాగంగా మంగళగిరిలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ యజమానులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.

టెక్నాలజీ సాయంతో ఎక్సైజ్ ఐ యాప్ నిఘానేత్రం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులను మానిటరింగ్ చేస్తామని తెలిపారు. గుంటూరు, పల్నాడు జిల్లాలు అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపుల్లో సీసీ కెమెరాలు ఉపయోగిస్తామని, ఎలాంటి అవతవకలు ఉన్నా ఈ ఎక్సైజ్ ఐ యాప్ ద్వారా రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తుందన్నారు.

మద్యం అమ్మకాల్లో ఎటువంటి అవతవకలు జరగకూడదనే ప్రభుత్వం ఈ యాప్ ను ప్రవేశపెట్టిందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై నేటి వరకు 2458 కేసులు నమోదు చేసి 1451 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

3011 లీటర్లు అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నామని, 1.0144 ఎండిఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకుని 25 వాహనాలను ను సీజ్ చేశామని తెలిపారు. 847 బెల్ట్ షాపులను గుర్తించి 849 మంది అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 2,392 లీటర్లు అక్రమ మద్యం, 239 లీటర్లు బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నా మన్నారు.

ఇక బహిరంగంగా మద్యం సేవించే వారిపై 423 కేసులు నమోదు చేసి 433 మందిని అరెస్ట్ చేశామన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాల నుంచి నుండి నాన్ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చి విక్రయిస్తున్న 206 మందిని ఎన్డీపిఎల్ చట్టo కింద కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు తెలిపారు.

అలాగే గత ఐదేళ్లుగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 77 మందిని బైండోవర్ చేసామని, అందులో ఐదుగురు తిరిగి గంజాయి విక్రయిస్తుంటే వారికి రూ.35 వేల రూపాయల చొప్పున జరిమానాలు విధించినట్లు తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ సీఐ వీరాంజనేయులు పాల్గొన్నారు.