The Desk…Mangalagiri : ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ABCD అవార్డ్స్ : AP DGP

The Desk…Mangalagiri : ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ABCD అవార్డ్స్ : AP DGP

🔴 గుంటూరు జిల్లా : మంగళగిరి : డిజిపి కార్యాలయం : ది డెస్క్ :

ది. 16.04.2025న డిజిపి ప్రధాన కార్యాలయంలో నేర పరిశోధన రంగంలో, కేసుల త్వరితగతిన పరిష్కారానికి అధునాతన విధానాలను పాటించి, వినూత్న మార్గాలను అనుసరించిన పోలీస్ అధికారులను గుర్తించి వారిని ABCD (AWARD FOR BEST IN CRIME DETECTION) అవార్డ్స్ ద్వారా డిజిపి హరీష్ కుమార్ గుప్తా అభినందించి సత్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్-డిసెంబర్ 2024 నాలుగోవ త్రైమాసానికి గాను ఉత్తమ ప్రతిభ కనబర్చిన కేసుల పూర్వాపరాలను,కేసుల పరిష్కారంలో వినియోగించిన సాంకేతిక పద్ధతులను, వినూత్న విధానాలను పూర్తిగా పరిశీలించిన సిఐడి- డీజీపి రవిశంకర్ అయ్యిన్నార్ నాలుగు ఉత్తమ కేసులను ఎంపిక చేయడం జరిగింది.

అవార్డుకు ఎంపికయిన కేసుల వివరాలు :

1. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, IPS నేతృత్వంలోని టీమ్ విజయవంతంగా ఆకివీడు మండల పరిధిలోని జరిగిన హత్య కేసును చాకచక్యంగా చేధించినందుకు గాను ఉత్తమ బహుమతి అందజేయడం జరిగింది.

2. సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న, IPS నేతృత్వంలోని టీమ్ విజయవంతంగా గుడిబండ పరిధిలో ఒక వ్యక్తి తన శిశువుని హత్య చేసి తప్పించుని కర్ణాటక రాష్ట్రంలో నకిలీ పేరుతో తిరుగుతున్న నిందుతుడిని పట్టుకొని పెండింగ్ లో ఉన్న 26 సంవత్సరాల పాత కేసుని చేదించినందుకుగాను ద్వితీయ బహుమతిని అందజేయడం జరిగింది.

3. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ IPS నేతృత్వంలోని టీమ్ విజయవంతంగా విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషను పరిధిలో నమోదైన సైబరు క్రైం (డిజిటల్ అరెస్టు) కేసును చేధించి, ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.10 లక్షల నగదు, రూ.9.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రికవరీతో పాటు, ఫిర్యాది సకాలంలో స్పందించిన కారణంగా నిందితుల బ్యాంకు ఖాతాల్లో మరో రూ.22 లక్షలను ఫ్రీజ్ చేసి డిజిటల్ అరెస్టు కేసును చాకచక్యంగా చేదించినందుకుగాని తృతీయ బహుమతిని అందజేయడం జరిగింది.

4. గుంటూర్ జిల్లా ఎస్పీ యస్ సతీష్ కుమార్, IPS నేతృత్వంలోని టీమ్ విజయవంతంగా చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక హత్య కేసును చాకచక్యంగా చేదించినందుకుగాను కన్సోలేషన్ బహుమతిని అందజేయడం జరిగింది.

ABCD అవార్డుల ప్రధానంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు :

మొదటి స్థానం పొందిన కేసుకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ,…

రెండవ స్థానం పొందిన కేసుకు 60 వేలు…

మూడవ స్థానం పొందిన కేసుకు 40 వేల రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతి పొందిన కేసుకు 20 వేల రూపాయల ప్రైజ్ మనీ మరియు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది. డిజిపి హరీష్ కుమార్ గుప్తా పోలీస్ శాఖలో సిబ్బంది అందరూ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.