గుంటూరు జిల్లా : మంగళగిరి రూరల్ : ది డెస్క్ :

బహిరంగ మద్యపానం సేవిస్తూ రోడ్ల వెంబడి వెళ్లే వారి పట్ల దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు.
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్. మురళీకృష్ణ సూచనలతో, గ్రామీణ సీఐ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆదివారం మంగళగిరి నగర పరిధిలోని ఎన్నారై వెనుక గల చెట్లపొదల్లో బహిరంగ మద్యపానం సేవిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా.. బహిరంగ మద్యపానం సేవిస్తున్న యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు.
బహిరంగ మద్యపానం సేవిస్తూ రోడ్ల వెంబడి వెళ్లే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, మద్యం మత్తులో ఘర్షణ పడుతున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేయటమైనదని వారిని న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరుగుతుందని ఎస్ఐ వెంకట్ తెలిపారు.
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి రోడ్ల పైన రహదారుల పైన పొలాలలో సీసాలు పగలగొట్టి రైతులకు పాదాచారులకు, అసౌకర్యం ఇబ్బంది కలిగించరాదని.. అలా కలిగించినఎడల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ బహిరంగ మద్యం బాబులను హెచ్చరించారు.
బహిరంగ మద్యపానం సేవిస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకట్ హెచ్చరించారు. మద్యం సేవించడంతోనే నేరాలు మొదలవుతాయని.. మద్యపానానికి దూరంగా ఉండాలని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ సూచించారు.