The Desk … Mandavalli :  సీసీ రోడ్ల నిర్మాణ పనులకు MLA డా. కామినేని శ్రీనివాస్  భూమిపూజ

The Desk … Mandavalli : సీసీ రోడ్ల నిర్మాణ పనులకు MLA డా. కామినేని శ్రీనివాస్ భూమిపూజ

ఏలూరు జిల్లా : మండవల్లి : ది డెస్క్ :

మండలంలోని భైరవపట్నం, మండవల్లి, పెరికేగూడెం, లింగాల, కానుకొల్లు గ్రామాలలో నరేగా నిధులుతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం NDA నాయకులుతో కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ భూమిపూజ చేసారు.

ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతు.. కూటమి సర్కార్ ఆంధ్రను అభివృద్ధి పధంలో పరుగులు పెట్టిస్తుందని హర్షం వ్యక్తం చేసారు. ఏ శాఖకు సంబంధించిన నిధులు ఆ శాఖకు అందుతున్నాయి కాబట్టే అభివృద్ధిలో ఎక్కడా రాజి పడటం లేదని తెలిపారు.

ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి తో అద్భుతమైన పాలన అందించటం ఒక్క NDA కూటమికే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.