The Desk…Mandavalli : అసెంబ్లీ..పార్లమెంటు విశిష్టత అందరికీ తెలియాలి అందుకు మాక్ అసెంబ్లీ వేదిక : ఇన్చార్జి హెచ్ఎం D. రవికుమార్

The Desk…Mandavalli : అసెంబ్లీ..పార్లమెంటు విశిష్టత అందరికీ తెలియాలి అందుకు మాక్ అసెంబ్లీ వేదిక : ఇన్చార్జి హెచ్ఎం D. రవికుమార్

  • మాక్ అసెంబ్లీకి లింగాల Z.P హైస్కూలు విద్యార్ధి అస్మితసాయి ఎంపిక

ఏలూరు జిల్లా : మండవల్లి : ది డెస్క్ :

రాష్ట్రస్థాయిలో అసెంబ్లీ, దేశస్థాయిలో పార్లమెంటు గొప్పతనం, విశిష్టత, చట్టాలు చేసే విధానం, సమస్యలపై చర్చావేదికలుగా, పాలకులు పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయని, అటువంటి అసెంబ్లీ.. పార్లమెంటు విశిష్టత అందరితోపాటుగా విద్యార్థులకు తెలియాలని లింగాల జెడ్పీ హైస్కూలు ఇన్చార్జి హెచ్ఎం డి.రవికుమార్ పేర్కొన్నారు. ఈ నెల 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో కలిసి మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు.

ఈ మాక్ అసెంబ్లీకి కైకలూరు నుండి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కాగా.. మండవల్లి మండలం లింగాల జెడ్పీహెచ్ హైస్కూల్ నుండి 9వ తరగతి విద్యార్థిని అస్మిత సాయి టాప్ 1లో అవకాశాన్ని సాధించింది.

సందర్భంగా స్కూల్ ఇన్చార్జ్ హెచ్ ఎం డి.రవికుమార్ మాట్లాడుతూ..

మాక్ అసెంబ్లీకి అస్మిత ఎంపిక కావటం ముదావహమన్నారు.. నియోజకవర్గ స్థాయిలో మొదటి స్థానం సంపాదించడం మా స్కూల్కి, మా గ్రామానికి గర్వకారణం అన్నారు.

సోషల్ మాస్టర్ sk.మౌలాలి మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగించేందుకు ఈ మాక్ అసెంబ్లీ మంచి వేదికగానిలుస్తుందన్నారు.

అనంతరం అస్మిత సాయి మాట్లాడుతూ..

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు విద్యారంగంలో నెలకొన్న పలు సమస్యలను మాక్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావిస్తానన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్లకు ప్రస్తుతం నెలకొన్న సమస్యలను వివరించి పరిష్కరించాలని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర పథకాల ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. విద్యారంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, విద్యావ్యవస్థ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్లు తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న కృషిని అభినందించాల్సిందేనని అస్మిత సాయి పేర్కొన్నారు.