The Desk…Mandavalli : అగ్ని ప్రమాద బాధితులకు ఎంపీ పుట్టా మహేష్ , ఎమ్మెల్యే కామినేని పరామర్శ

The Desk…Mandavalli : అగ్ని ప్రమాద బాధితులకు ఎంపీ పుట్టా మహేష్ , ఎమ్మెల్యే కామినేని పరామర్శ

ఏలూరు జిల్లా : మండవల్లి : THE DESK NEWS :

మండలంలోని భైరవపట్నం గ్రామములో 24న అగ్ని ప్రమాదం జరగగా.. ఘటనా స్థలానికి వెళ్లి భాధితులను శనివారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, కైకలూరు శాసనసభ్యుడు డా. కామినేని శ్రీనివాస్ తో కలిసి పరామర్శించారు. అనంతరం నిరాశ్రయులైన కుటుంబాలకు స్వచ్చందంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 50 వేలు, ఎమ్మెల్యే కామినేని రూ.50 వేలు మొత్తం ఒక లక్ష రూపాయిలు అందించారు.

కైకలూరులోని ప్రముఖ సేవ సంస్థ సత్యసాయి సేవాసంస్థ వారు సర్వం కోల్పోయిన కుటుంబాలకు బియ్యం నిల్వచేసే స్టీల్ డబ్బాలు, నిత్యావసర సరుకులు ఎంపీ, ఎమ్మెల్యేల చేతులు మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎంపీ, కామినేని లు మాట్లాడుతూ.. ఘటన జరగటం చాలా దురదృష్ట కరమని.. షుమారు 20 కుటుంబాల ఇళ్ళు అగ్నికి ఆహుతి అవ్వటం చాలా దారుణమన్నారు.

ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రి సుపరేంటెడెంట్తో మాట్లాడి తెలుసుకునీ.. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. త్వరలోనే అధికారులతో మాట్లాడి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని..అధైర్య పడవద్దు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

శాసనసభ్యులు కామినేని కోరిక మేరకు దాతలు శ్యామల ట్రేడర్స్ పార్ట్నర్స్ చాపరాల దుర్గాప్రసాద్, సజ్జా బాబీ కలిసి రూ. 50,000, చాపరాల బలరాముడు మనవరాలు చిన్నారి లాస్య రూ.10,000, గన్నమనేని సుధాకర్ (పసలపూడి నాని) కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.