The Desk…Mandavalli : నలుగురు పందెం రాయుళ్ల అరెస్ట్… రూ.5200వేలు నగదు సీజ్

The Desk…Mandavalli : నలుగురు పందెం రాయుళ్ల అరెస్ట్… రూ.5200వేలు నగదు సీజ్

ఏలూరు జిల్లా : మండవల్లి : THE DESK :

మండలంలోని భైరవపట్నం గ్రామంలో కోడి పందేలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను గురువారం మండవల్లి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

కోడి పందేలు ఆడుతున్నారని సమాచారం అందడంతో మండవల్లి ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లగా.. అక్కడ కొంత మంది కోడి పందేలు ఆడుతూ పోలీసులను చూసి పారిపోతుండగా ఎస్ఐ తనసిబ్బందితో కలసి నలుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూ.5200 వేలు నగదు, ఒక కోడి, ఒక కత్తి ని స్వాధీన పరచుకున్నారు.

నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తనకు సమాచారం అందివ్వాలని ఎస్ఐ కోరారు.