ఏలూరు జిల్లా : మండవల్లి : ఆనందపురం : THE DESK :
పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతకు సరిగ్గా సరిపోతుందీ చిన్నారి శ్రేష్ఠన్విత. నాలుగేళ్ల వయసుకే “ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్” లో చోటు సంపాదించి నలుగురినీ అబ్బురిపరిచింది. కన్న తల్లిదండ్రులకు ఆనందాన్నిచ్చి పుట్టిన ఊరుకు వన్నెతెచ్చింది.
వివరాలలోకి వెళితే… మండవల్లి మండలం ఆనందపురం గ్రామానికి చెందిన ప్రమీల బుంగ మహిళా పోలీసుగా పనిచేస్తున్నారు. భర్త ఇంటి పవన్ కుమార్ హైదరాబాద్లో ఒక ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరికి ఒక కుమార్తె శ్రేష్ఠన్విత(4), కుమారుడు శ్రేష్ఠభినవ్(1) ఉన్నారు. వీరి కుమార్తె అయిన ఇంటి శ్రేష్ఠ అన్విత(4) తన ప్రతిభను చాటుకుంది. ఇటీవల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది. ఆమె ఇంగ్లీష్ అక్షరాలను వాటి సంఖ్యా క్రమం వరసలో అత్యంత వేగంగా 13.17 మిల్లి సెకండ్లలో పఠించిన చిన్నారిగా గుర్తింపు పొందింది. ఈ ఘనత ఆమె తల్లిదండ్రులతో పాటు మొత్తం కుటుంబానికి ఎంతో గర్వకారణమైంది.
చిన్నారి ఇంత చిన్న వయస్సులోనే ఎంతో ప్రతిభ కనబరుస్తోంది. చిన్నారి ప్రస్తుతం కైకలూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో యు.కె.జి చదువుతుంది. స్కూల్లో జరిగే ప్రతి ప్రోగ్రాంలో ఎంతో చురుకుగా పాల్గుంటుంది. నృత్యం, గానం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు వంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ తన సహజమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తోంది. అంతేకాకుండా, ఆమె చదువులోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ, తన తోటివారికి ఆదర్శంగా నిలుస్తోంది.
తన తల్లితండ్రులు ఉద్యోగం చేస్తునప్పటి కూడా తమ పిల్లలతో సమయం గడుపుతూ ఆటల పాటల రూపంలో కొత్త విషయాలను నేర్పిస్తూ ఉంటారు. ఇప్పటికే తెలుగు గుణింతాలు, దేశంలో ఉన్న రాష్ట్రాలు వాటి రాజధానుల పేరులు చక చక చెప్పేస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఈ పాప చేసిన ఒక వీడియో, ఆపద సమయంలో ఫోన్ చేయవలసిన నంబర్స్ చెప్పిన విధానం ఎంతో అబ్బురపరిచింది.
చిన్నారి ప్రతిభకు కారణం ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం, అనుకూలమైన వాతావరణం. వారు ఆమె ప్రతిభను గుర్తించి, అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు. శ్రేష్ఠన్విత విజయం చిన్నారుల సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ఎంత ప్రాముఖ్యమో నిరూపిస్తోంది. చిన్నారి భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించి, తన ప్రతిభతో దేశం గర్వపడేలా పేరు తెచ్చుకోవాలని కుటుంబ సభ్యులు ఆశ.
మేము ఎంతో గర్విస్తున్నాం
మా పెద్ద మనవరాలు ప్రతిభను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించడం మాకు ఎంతో గర్వంగా ఉంది. చిన్నప్పటినుంచి ఏది అయిన సరే చాలా త్వరగా నేర్చుకుంటది. తను ఇంకా మా పేరు నిలబెట్టి అత్యున్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటున్నాం. – తాతయ్య అమ్మమ్మ
https://indiabookofrecords.in/about-us/