The Desk …Mandapam : అమరావతికి జీవం పోద్దాం.. ₹116/- సాయం చేద్దాం -కార్యక్రమంలో భాగంగా..

The Desk …Mandapam : అమరావతికి జీవం పోద్దాం.. ₹116/- సాయం చేద్దాం -కార్యక్రమంలో భాగంగా..

మందడం గ్రామ సచివాలయ సిబ్బందికి పాదపూజ చేసిన డాక్టర్ మనోజ్

🔴 అమరావతి : మందడం : ది డెస్క్ :

మందడం గ్రామ సచివాలయ సిబ్బందికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పాదపూజ చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమరావతికి జీవం పోద్దాం.. 116/- రూపాయలు సాయం చేద్దాం.. అనే కార్యక్రమం నిర్వహించగా.. సచివాలయ సిబ్బంది అమరావతి నిర్మాణంలో.. పాలిభాగస్తులగుటకై సి ఆర్ డి ఐ అకౌంట్ కు క్యూ ఆర్ కోడ్ ద్వారా స్వతహాగా నగదు బదిలీ చేశారు.

సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ…

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపుమేరకు.. రాష్ట్రమంతా ప్రతి ప్రదేశానికి వెళ్లి అమరావతి నిర్మాణానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కొంతమంది నెల జీతం, వారి యొక్క దినసరి వేతనం మరికొందరైతే వారి యొక్క స్తోమత బట్టి కనీసం 116/- రూపాయలు అయినా సరే సహాయం చేయమని … మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబుకు మన వంతు చేయూతనిద్దాం అంటూ.. డాక్టర్ మనోజ్ సచివాలయ చేస్తున్న సేవల నిమిత్తం.. సిబ్బంది పాదాలు కడిగి వారిని సత్కరించారు. వారు కూడా క్యూ ఆర్ కోడ్ ద్వారా సిఆర్డిఏ ఎకౌంటుకు 116 రూపాయలు చెల్లించారు.

ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, స్థానికులు పలువురు పాల్గొన్నారు.