ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : మాదేపల్లి : THE DESK :
సాగునీటి సంఘాల ప్రెసిడెంట్ గా చింతపల్లి సాల్మన్ రాజు..వైస్ ప్రెసిడెంట్ గా అమన్ రమణ ఏకగ్రీవ ఎన్నికైన సందర్భంగా… దెందులూరు నియోజకవర్గ మెంబర్లు సాగునీటి సంఘాల పరిశీలకులైన కమ్మ శివరామకృష్ణ ఆధ్వర్యంలో..మాదేపల్లి గ్రామ టిడిపి నాయకులు, జనసేన నాయకులు, బిజెపి నాయకులు, సాగునీటి సంఘాల టీం సభ్యులందరూ సోమవారం దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులైన చింతమనేని ప్రభాకర్ ను కలిశారు.
ఈ సందర్బంగా కొత్తగా ఎన్నికైన సాగునీటి సంఘాల సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసి… నూతనంగా ఎన్నికైన వారు వారికి అప్పచెప్పిన పనిలో కష్టపడి పనిచేసి , నిష్పక్షపాతంగా వ్యవహరించి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చింతమనేని సూచించారు.