ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : మాదేపల్లి : THE DESK :
దెందులూరు నియోజకవర్గం లోని మాదేపల్లి గ్రామంలో శనివారం జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలలో ప్రెసిడెంట్ గా చింతపల్లి సల్మాన్ రాజు, వైస్ ప్రెసిడెంట్ గా సకల అమన్ రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అదేవిధంగా మొత్తం 13 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సాగునీరు సంఘాల ఎలక్షన్ అధికారి ప్రకటించడం జరిగింది. అనంతరం డైరెక్టర్లను ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లను పూలదండలతో శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘం ప్రెసిడెంట్ చింతపల్లి సల్మాన్ రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
సాగునీటి సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతాల పరిధిలో నీటి ఎద్దడి లేకుండా రైతులంతా సంతోషంగా పంటలు పండించుకునే వీలు ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి సభ్యులంతా తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ నాయకులు పవన్,శేఖర్ లు మాట్లాడుతూ… ఈ ప్రాంతంలో 1300 ఎకరాలు కు ఈసాగునీటి సంఘాల ద్వారా నీరు ఏర్పడుతుందని తెలిపారు. చింతమనేని ప్రభాకర్ రావు ఈ ప్రాంతంలో రైతుల కోసం ఎంతో చేస్తున్నారని కొనియాడారు.