The Desk…Machilipatnam : MSME పార్క్ ఏర్పాటుకు స్థలాలను గుర్తించండి… రెవెన్యూ డివిజన్ అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం

The Desk…Machilipatnam : MSME పార్క్ ఏర్పాటుకు స్థలాలను గుర్తించండి… రెవెన్యూ డివిజన్ అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

జిల్లాలో నియోజకవర్గానికి ఒక ఎం ఎస్ ఎం ఈ పార్క్ నేలకొల్పుటకు అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్ నుండి రెవెన్యూ డివిజనల్ అధికారులతో ఎం ఎస్ ఎం ఈ పార్కుల ఏర్పాటు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెస్ ఎం ఇ పార్కు ఏర్పాటు చేయుటకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్లో డిఐసి జిఎమ్ వెంకట్రావు, ఏపి ఐఐసి జోనల్ మేనేజర్ బాబ్జి, మచిలీపట్నం, ఉయ్యూరు గుడివాడ ఆర్డీవోలు స్వాతి, హేలా షారోన్, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.