కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
కృష్ణా విశ్వవిద్యాలయంలో 90 COY 16(A) బెటాలియన్ ఎన్ సి సి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఎన్ సి సి దినోత్సవ వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. రాంజీ హాజరై ఎన్ సి సి సేవా విలువలను కొనియాడారు. ఎన్ సి సి క్రమశిక్షణ, నాయకత్వం, దేశ సేవ పట్ల నిబద్ధతను సేవ భావన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ ప్రిన్సిపాల్ డా. ఆర్. విజయ కుమారి మాట్లాడుతూ.. ఎన్ సి సి శిక్షణ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు. ఎ ఎన్ ఓ లెఫ్టెనెంట్ డా. డి రామశేఖర రెడ్డి ఈ కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ, క్యాడెట్లు క్రమశిక్షణతో పాటు సమాజ పట్ల బాధ్యతను కూడా అలవర్చుకుంటారని అన్నారు.ఎన్ సి సి డే సందర్భంగా క్యాడెట్లు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
అలాగే మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమం లో క్యాడెట్లు పోస్టర్ ప్రదర్శనలు, చర్చా వేదికలు, అవగాహన సందేశాలు అందిస్తూ విద్యార్థుల్లో చైతన్యం నింపారు.క్యాంపుల్లో పాల్గొన్న క్యాడెట్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేసారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

