The Desk…Machilipatnam : రాష్ట్రస్థాయి కబడ్డీ టీం సెలక్షన్ పోటీలను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

The Desk…Machilipatnam : రాష్ట్రస్థాయి కబడ్డీ టీం సెలక్షన్ పోటీలను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం లోని నోబుల్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 22నుంచి 24 వరకు జరిగే అండర్ 14 బాల బాలికల 69వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర జిల్లా కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2025-26 ఏపీ జట్టు ఎంపిక కార్యక్రమాన్ని శనివారం రాత్రి ప్రారంభించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇందుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఉద్యోగ అవకాశాలలో స్పోర్ట్స్ కోటా వల్ల ఎంతో మంది క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు

ఇటీవల జరిగిన డీఎస్సీ లో 450 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో టీచర్లు గా అవకాశాలు లభించాయన్నారు ఏపీని ఫిట్నెస్ చేయటమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు .అందుకోసం విద్యార్థులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు

మచిలీపట్నం ను జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లకు వేదికగా మారుస్తామన్నారు. వచ్చే మూడు నాలుగు నెలల్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మచిలీపట్నంలో నిర్వహిస్తామన్నారు. వరల్డ్ కప్ పోటీలకు బందరును వేదిక చేస్తామన్నారు.