The Desk…Machilipatnam : కన్నుల పండువగా శ్రీ పాండురంగ స్వామి వారి తెప్పోత్సవం

The Desk…Machilipatnam : కన్నుల పండువగా శ్రీ పాండురంగ స్వామి వారి తెప్పోత్సవం

ప్రతి ఏటా పాండురంగనికి తెప్పోత్సవం : మంత్రి కొల్లు

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవములలో భాగంగా చిలకలపూడి లో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగస్వామి వారి తెప్పోత్సవం మచిలీపట్నం లోని కాలేఖాన్ పేట మంచినీటి ( నాగులేరు ) కాలువ వద్ద అంగరంగ వైభవంగా జరిగింది.

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాల్లో పాల్గొనడంతో తమ జన్మ ధన్యం అవుతుందనే భావం భక్తుల్లో కనిపిస్తుంది అన్నారు.

1977 ఉప్పెన తర్వాత పాండురంగ స్వామి ఉత్సవాలు ఘనంగా జరగలేదని రథయాత్ర నిర్వహణకు ఆస్కారం లేకుండా పోయిందని అన్నారు. తిరిగి 2014 నుంచి పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడమే కాక రథోత్సవం.. అలాగే ఈ ఏడాది నుంచి తెప్పోత్సవం కార్యక్రమాలు వీనులవిందుగా జరుగుతున్నాయన్నారు.

సూర్య చంద్రులు ఉన్నంతవరకు పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు ఇలా జరుగుతూనే ఉంటాయన్నారు. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం పూర్తి కావాలని.. మన బిడ్డలందరికీ ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభించాలని ఆ పాండురంగ స్వామిని మనసారా కోరుకుంటూ ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర తన మనసులోనే మాటను ఆ పాండురంగ స్వామి కి విన్నవించారు.