The Desk…Machilipatnam : అవకాశాలను అందిపుచ్చుకొని పేదరికాన్ని జయించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : అవకాశాలను అందిపుచ్చుకొని పేదరికాన్ని జయించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • నైపుణ్య అభివృద్ధి కేంద్రం శిక్షణ తరగతిలో కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

మంగళవారం ఉదయం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో పి–ఫోర్ మార్గదర్శి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో 45 మంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లకు తొలి బ్యాచ్ శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వము, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పేరుతో పి—4 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

సమాజంలో కష్టపడి ఒక ఉన్నత స్థానానికి వచ్చిన వ్యక్తులు తనలాగా తపనపడి పేదరికం నుండి బయటపడాలనే బంగారు కుటుంబాల వారికి సహాయం చేసేందుకు పి ఫోర్ మార్గదర్శిలు ముందుకు వస్తున్నారన్నారు.

ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్నీ సందర్శించినప్పుడు పి -ఫోర్ కార్యక్రమం గురించి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ అధినేతకు వివరించి మార్గదర్శిగా ఉండాలని కోరడంతో.. నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం రూపు దాల్చిందన్నారు.

గుడ్లవల్లేరు, డోకిపర్రు పరిసర ప్రాంతాల్లో నిజంగా జీవితంలో ఎదగాలనే ఆలోచనతో శిక్షణా తరగతులకు రావడం సంతోషదాయకమని, అందరూ బాగా శిక్షణ పొంది పేదరికం నుండి బయట పడేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. నైపుణ్య శిక్షణ అవకాశాలు వచ్చినప్పుడు శ్రద్ధతో నేర్చుకుని జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలన్నారు.

ఇంటి నిర్మాణంలో ఎలక్ట్రీషియన్లకు, ప్లంబర్లకు డిమాండ్ బాగా ఉందని, మంచి పనితనం నైపుణ్యం ఉంటే ఉపాధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడు పాత తరం ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు రాను రాను తగ్గిపోయి కొరత ఏర్పడుతుందన్నారు. హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాలలో ఓలా, ఊబర్ క్యాబ్లు, ఆటోలు మాదిరిగా అర్బన్ యాప్ పేరుతో ఇంట్లో అవసరమైన పనులకు కొత్త విధానాలు అవలంబిస్తున్నారన్నారు.

ప్రస్తుత మార్కెట్లో ఎలక్ట్రీషియన్లకు, ప్లంబర్లకు ఎక్కువగానే ఆదాయం వస్తుందన్నారు. చాలా ప్రభుత్వ భవనాల్లో నిర్మాణ పనులకు ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు అవసరం మేరకు దొరకడం లేదన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శిక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల పనిముట్లు, పరికరాలను పరిశీలించారు.

కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, గుడివాడ నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, తహసిల్దార్ లోకరాజు, ఎంపీడీవో ఇమ్రాన్, వెలుగు ఏపిఎం పాండురంగ ప్రసాద్, మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ శివరామకృష్ణ, శిక్షణ అధిపతి జిలాని, ప్రతినిధులు వెంకటరత్నం, శిక్షకులు కిషోర్ తదితర అధికారులు అనధికారులు శిక్షణార్థులు తదితరులు పాల్గొన్నారు.