- “స్వర్ణ పంచాయితీ – నిమిషాల్లో పన్నులు చెల్లించండి” గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్
కృష్ణాజిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ :
గ్రామ పంచాయతీకి సంబంధించి పన్నులు ఆన్లైన్ ద్వారా చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సులభతరం చేసిందని, ఈ వెసులుబాటును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ పర్హిన్ జాహిద్ లతో కలిసి స్వర్ణ పంచాయితీ– నిమిషాల్లో పన్నులు చెల్లించండి పేరుతో రూపొందించిన గోడపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సోమవారం నుండి ఆన్లైన్ పద్ధతిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించే నూతన విధానం ప్రారంభించిందన్నారు. ఈ పద్ధతిలో సులభంగా పంచాయతీ పన్నులన్నీ చెల్లించవచ్చన్నారు.
ప్రతి పంచాయతీ కార్యాలయము సచివాలయం ప్రభుత్వ కార్యాలయాల్లో గోడపత్రాలను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని పన్నులను చెల్లించాలని జిల్లా కలెక్టర్ కోరారు. దీంతో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు అందించే అవకాశం లభిస్తుందన్నారు.

