- కృష్ణాజిల్లా అందత్వ నివారణ అధికారి, ప్రభుత్వ నేత్ర వైద్య నిపుణులు.. డాక్టర్ జి. భానుమూర్తి సూచన
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
వయసుతో నిమిత్తం లేకుండా సెల్ ఫోన్ వినియోగం తగ్గించుకోవాలని లేకపోతే వాటి ప్రభావం కంటిపై పడుతుందని కృష్ణాజిల్లా అందత్వ నివారణ అధికారి మరియు మచిలీపట్నం జిల్లా సర్వజన ఆస్పత్రి ప్రముఖ నేత్ర వైద్యులు జి. భానుమూర్తి అన్నారు.
మచిలీపట్నం మోడరన్ ఐ కేర్ నిర్వాహకులు మహమ్మద్ నియాజ్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ పాలెం ఉర్దూ షాది ఖానా లో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి డాక్టర్ భానుమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై ఉచిత సేవలు అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ భానుమూర్తి మాట్లాడుతూ.. మారుతున్న సమాజంలో చంటి పిల్లలకు సెల్ ఫోన్ చూపించి ఫీడింగ్ ఇస్తున్నారని అది మంచి పద్ధతి కాదు అని అన్నారు. యువత ఎక్కువ సమయం సెల్ ఫోన్ ఉపయోగించడం వలన వయసు పెరిగిన తర్వాత దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అన్నారు.
సెల్ ఫోను అత్యవసర సమయాల్లోనే ఉపయోగించాలని, చీకట్లో సెల్ ఫోన్ వినియోగం మరింత ప్రమాదకరమని అన్నారు.ప్రతి ఒక్కరు కంటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యంగా షుగర్ ఉన్న పౌరులు ప్రతి ఆరు నెలలకు చికిత్స పరీక్షలు పొందాలని అన్నారు. మెరుగైన కంటిచూపు కోసం పాలు, గుడ్లు, ఆకుకూరలు వంటి పోషక పదార్థాలు తీసుకోవాలని అన్నారు.
మరో వైద్యులు సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ కాగిత రాకేష్ మాట్లాడుతూ న్యూరో కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మెదడులోని కణి తలు, తలకు గాయాలు, మూర్చ, మెడనొప్పి, నడుము నొప్పి, కళ్ళు తిరగటం పార్కిన్సన్ సంబంధిచిన జబ్బులు ఉన్నప్పుడు ప్రాథమిక స్థాయి నుండే మందులు వాడి నివారణ చేసుకోవచ్చని అన్నారు. నరాల పనితీరు అంచనా వేయటానికి ఎలక్ట్రోమాయో గ్రాఫి పరీక్షలు అవసరం కావచ్చని అన్నారు.
నరాల బలహీనత ఉన్నవారు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉండే నారింజ, జామ, బెర్రీలు వంటి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు కూడా ఉంటాయని అన్నారు. నరాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు మెదడు పనితీరు మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవడం అవసరమని అన్నారు.
మరో న్యూరో సర్జన్ డాక్టర్ పరస లక్ష్మీ భావన మాట్లాడుతూ సరైన పోషక పదార్థాలు తీసుకోకపోవడం వలన రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవటం తగిన వ్యాయామం నడక లేకపోవడం వలన యువతలో ఎక్కువగా నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ నరాలు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ధూమపానం మద్యం కు దూరంగా ఉండాలని సూచించారు.
మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ.. ప్రతి వైద్యుడు తమ సమయంలో కొంత సమాజం పేదవారికి కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉందని, పేదవారికి ఉచితంగా అందించే వైద్య సేవలు మాధవ సేవతో సమానమని అన్నారు.నేడు ఉచిత మెడికల్ క్యాంపులో పేదవారికి కాగిత రాకేష్,పరసా లక్ష్మీ భావన ఖరీదైన మందులను ఉచితంగా అందించడం అభినందనీయమని బాలాజీ అన్నారు.
కృష్ణాజిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరస మధుసూదనరావు మాట్లాడుతూ జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో పేదవారి కోసం మోడ్రన్ ఐ కేర్ ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి సీనియర్ డాక్టర్లతో ఉచితంగా వైద్యము మందులు అందించడం ఆదర్శమైన కార్యక్రమమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసిమ్ బేగ్ మాటలతో దీపావళి పండుగ రోజున డాక్టర్లు తమ కుటుంబంతో కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వైద్య శిబిరంలో పాల్గొని ఉచితంగా మందులు అందించటం సంతోషదాయకమన్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బావ ప్రసాద్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందిన పేదవారికి ఈ విధమైన ఉచిత మెగా శిబిరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని అన్నారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు వైద్య శిబిరం నిర్వహించి సుమారు 300 మందికి పరీక్షలు చేసి మందులు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మోడరన్ ఐ కేర్ యజమాని ఎండి. నియాజ్ ను అందరు అభినందించారు.