The Desk…Machilipatnam : ప్రభుత్వ వృద్ధ శరణాలయంలో లయన్స్ క్లబ్ దీపావళి సంబరాలు….

The Desk…Machilipatnam : ప్రభుత్వ వృద్ధ శరణాలయంలో లయన్స్ క్లబ్ దీపావళి సంబరాలు….

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ మచిలీపట్నం ఆధ్వర్యంలో సోమవారం ఈడేపల్లి ప్రభుత్వ వృద శరణాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పంచపర్వాల హిమబిందు, కార్యదర్శి పి.ప్రభాకర్ రావు, కోశాధికారి శ్యాం గోల్డ్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వృద్ధులందరికీ మిఠాయిలు పంచిపెట్టి వృద్ధులు చే దీపావళి బాణసంచా సామాగ్రి కాల్పించి వృద్ధులను ఆనందపరిచారు.

గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దీపావళి వేడుకలు లయన్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని సీనియర్ లయన్ మెంబర్ జి.రాంబ్రహ్మం తెలియజేశారు.

మరో సీనియర్ లయన్ సభ్యులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ పేదవాడి కంటిలోని ఆనందమే నిజమైన దీపావళి అని, నిరాధారణకు గురైన వృద్ధుల వద్ద దీపావళి చేయటం తమ కెంతో సంతృప్తికరంగా ఉందని అన్నారు.

కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మేడిశెట్టి యోగానంద రావు, పంచ పర్వాల పవన్,గుంటముక్కల శ్రీరామ్ భరత్ కుమార్, వృద్ధ శరణాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు